Monday, December 23, 2024

కునో పార్కులో 12 చీతాలకు మొదటి భోజనం

- Advertisement -
- Advertisement -

షియోపూర్ : మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కుకు రెండు రోజుల క్రితం దక్షిణాఫ్రికా నుంచి తీసుకు వచ్చిన 12 చీతాలకు మొదటి సారి భోజనం పెట్టారు. ఈ విషయాన్ని సోమవారం అధికారులు తెలిపారు. 12 చీతాల్లో 7 మగవి, 5 ఆడవి. ఆదివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో వాటి క్వారంటైన్ బోమాస్‌లో 65 నుంచి 70 కిలోల ఎనుబోతు మాంసం పెట్టగా, అదంతా ఆరగించాయని కెఎన్‌పి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పికె వర్మ చెప్పారు. శనివారం భారత్‌కు వాటిని తీసుకు వచ్చే ముందు ఈనెల 15న దక్షిణాఫ్రికా లోని రూయిబెర్గ్, ఫిండా రిజర్వు ఫారెస్ట్‌లోని బోమాస్‌లో ఉంచారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇవి ఫారెస్టులో మామూలుగా అలవాటు పడే వరకు వీటిని దాదాపు నెల రోజుల పాటు క్వారంటైన్ గదుల్లో ఉంచుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News