Wednesday, September 18, 2024

డాక్టర్ల భద్రతపై జాతీయ టాస్క్ ఫోర్సు తొలి భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలోని ఆరోగ్య సంరక్షకుల భద్రత, రక్షణ కోసం ప్రొటోకాల్ రూపొందించేందుకు సుప్రీం కోర్టు నియమించిన జాతీయ టాస్క్ ఫోర్సు మంగళవారం నాడిక్కడ మొట్టమొదటిసారి సమావేశమై ఈ అంశంపై అన్ని భాగస్వామ్య పక్షాలతో విస్తృతంగా సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. కోల్‌కతలోని ఆర్‌జి కార్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఒక పోస్టు గ్రాడ్యుయేట్ ట్రెయినీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీయడంతో ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు గతవారం 10 మంది సభ్యులతో జాతీయ టాస్క్ ఫోర్సు(ఎన్‌టిఎఫ్)ను ఏర్పాటు చేసింది.

దేశవ్యాపగా ప్రజలు, వివిధ భాగస్వామ్యపక్షాల నుంచి సూచనలు కెరేందుకు సజెషన్స్ టు ఎన్‌టిఎఫ్ పేరిట కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఒక జాతీయ పోర్టల్‌ను కూడా రూపొందించింది. మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో ఇందుకు సంబంధించిన లింక్ అందుబాటులో ఉందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ పోర్టల్‌కు వచ్చే సూచనలను క్రోడీకరించి ఎన్‌టిఎఫ్ సభ్యులకు అందచేస్తామని అధికారులు చెప్పారు. క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన నేటి సమావేశంలో హోం కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శితోసహా సభ్యులందరూ పాల్గొన్నట్లు వారు చెప్పారు. వివిధ అంశాలపై సభ్యులు విస్తృతంగా చర్చించారని, వారు తమ సూచనలను కూడా సమావేశంలో తెలియచేశారని అధికారులు వివరించారు. వివిధ భాగస్వామ్యపక్షాలు తమను నేరుగా సంప్రదించాయని, దాదాపు 300 నుంచి 400 సూచనలు తమకు అందాయని ఎన్‌టిఎఫ్ సభ్యులు తెలియచేసినట్లు అధికారులు తెలిపారు.

ఎన్‌టిఎఫ్ సభ్యులతో కలసి ఆరోగ్య శాఖ కార్యదర్శి వివిధ ప్రధాన భాగస్వామ్యపక్షాలతో విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతారని వారు వివరించారు. వైద్య సంస్థలలో అందుబాటులో ఉన్న భద్రతా చర్యలపై సమాచారాన్ని అందచేయవలసిందిగా రాష్ట్రాలను కూడా కోరినట్లు వారు చెప్పారు. ఇందుకోసం రాష్ట్రాలకు గూగుల్ షీట్‌ను సమకూర్చినట్లు వారు తెలిపారు. వైద్య సిబ్బంది భద్రతకు సంబంధించి తీసుకోవలసిన స్వల్ప కాలిక చర్యలను చర్చించేందుకు బుధవారం రాష్ట్ర చీఫ్ సెక్రటరీలు, డిజిపిలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర హోం కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సహ అధ్యక్షత వహిస్తారని వారు వెల్లడించారు. అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఐఎంఎ, రెసిడెంట్ డాక్టర్ల సంఘాలతో కూడా ఎన్‌టిఎఫ్ సంప్రదింపులు జరుపుతుందని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News