న్యూఢిల్లీ: ఇటీవల పునర్వ్యవస్థీకరించిన కాగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్ల్యుసి) తొలి సమావేశాన్ని సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లో నిర్వహించాలని కాంగ్రెస్ అద్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిర్ణయించారు. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సోమవారం ప్రకటించారు.
ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొనసాగుతుందని, ఇందులో అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు కూడా పాల్గొంటారని తెలిపారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో బహిరంగ సభ జరుగుతుందని, ఇందులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ హామీలను ప్రకటిస్తుందని వేణుగోపాల్ వెల్లడించారు.
VIDEO | "Congress president has decided to convene the first meeting of the newly-constituted working committee on September 16 in Telangana, which will be followed by an extended working committee meeting," says Congress leader @kcvenugopalmp. pic.twitter.com/7Q7MsyG2ox
— Press Trust of India (@PTI_News) September 4, 2023