Thursday, January 23, 2025

నదీ గర్భంలో తొలి మెట్రో టన్నెల్

- Advertisement -
- Advertisement -

కోల్‌కతాలో నేడు ప్రారంభించనున్న ప్రధాని మోడీ

కోల్‌కతా : భారత్‌లోనే మొట్టమొదటి సారిగా కోల్‌కతాలో నదీ గర్భంలో నిర్మించిన మెట్రో టన్నెల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇది పట్టణ ప్రాంత రవాణాను విశిష్ట రీతిలో మెరుగుపరచనుండగా ప్రధాని మోడీ దేశాల మీదుగా పలు కీలక మెట్రో, రాపిడ్ ట్రాన్సిట్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో రవాణాను, అనుసంధానాన్ని పెంచడంలో ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు. హౌరా మైదాన్= ఎస్‌ప్లనేడ్ మెట్రో సెక్షన్‌తో కూడిన కోలకతా మెట్రో ఎక్స్‌టెన్షన్‌లో భారత్‌లోనే తొలిసారిగా ఒక పెద్ద నది కిందుగా సాగే రవాణా టన్నెల్ చేరి ఉంది. దీనిని దేశంలో మౌలిక వసతుల అభివృద్ధిలో కీలకమైన మైలురాయిగా అభివర్ణిస్తున్నారు.

ఈ సెక్షన్ నిర్మాణంలో ఇమిడి ఉన్న సాంకేతిక నైపుణ్యాన్ని సూచిస్తుండడమే కాకుండా కోల్‌కతాలో బాగా జనసమ్మర్దంగా ఉండే రెండు ప్రాంతాల వ్యూహాత్మక అనుసంధానాన్నీ చాటిచెబుతున్నది. నగర రవాణా నెట్‌వర్క్ సామర్థాన్ని ఇది పెంచుతోంది. నదీగర్భంలోని మెట్రోతో పాటు కవి సుభాష్= హేమంత ముఖోపాధ్యాయ్ మెట్రో సెక్షన్, జోకా= ఎస్లనేడ్ లైన్‌లో భాగమైన తారతలా-మజెర్‌హట్ మెట్రో సెక్షన్‌ను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కోల్‌కతాకే పరిమితం కావడం లేదు. దేశవ్యాప్తంగా పలు ఇతర ముఖ్య ప్రాజెక్టులకు కూడా ప్రధాని మోడీ ప్రారంభోత్సవం చేయనున్నారు. వాటిలో పుణెలో రూబీ హాల్ క్లినిక్ నుంచి రామ్‌వాడి వరకు మెట్రో మార్గం, కొచ్చిలో ఎస్‌ఎన్ జంక్షన్ మెట్రో స్టేషన్ నుంచి త్రిపునితుర మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైల్ మొదటి దశ విస్తరణ, ఆగ్రాలో తాజ్ ఈస్ట్ గేట్ నుంచి మంకమేశ్వర్ వరకు మెట్రో విస్తరణ, ఢిల్లీమీరట్ ఆర్‌ఆర్‌టిఎస్ కారిడార్‌లో దుహాయిమోడీనగర్ (ఉత్తర) సెక్షన్ కూడా ఉన్నాయి. అంతే కాదు. పుణెలో పింప్రి చించ్‌వాడ్ మెట్రో, నిగ్డి మధ్య మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొదటి దశ విస్తరణకు మోడీ శంకుస్థాపన కూడా చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News