Monday, January 20, 2025

కశ్మీర్‌లో వచ్చేనెల మొదటి మల్టీప్లెక్స్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : వచ్చే సెప్టెంబర్ నెల కశ్మీర్ లోయలోని సినీ అభిమానుల వేడుకకు తగ్గట్టు మల్టీప్లెక్స్ ప్రారంభం కానున్నది. సోనావార్ ఏరియాలో ప్రారంభం కానున్న మల్టీప్లెక్స్‌లో తాజా సినిమాలు ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి. థియేటర్ ఛైన్ ఐఎన్‌ఒఎక్స్ సహకారంతో రూపొందిన ఈ మల్టీప్లెక్స్‌లో మొత్తం 520 సీట్ల కెపాసిటీతో మూడు సినిమా హాళ్లు నిర్మాణమయ్యాయని మల్టీప్లెక్స్ యజమాని విజయ్ ధర్ చెప్పారు. శ్రీనగర్ శివారున అథ్వజన్ వద్ద ఢిల్లీ పబ్లిక్ స్కూలును కూడా థర్ నిర్వహిస్తున్నారు.

మొదట రెండు థియేటర్లు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయని, మరొకటి అక్టోబర్‌లో ప్రారంభమౌతుందని చెప్పారు. అనేక ఫుడ్ కోర్టులు, గేమింగ్ జోన్ కూడా ఈ మల్టీప్లెక్స్‌లో ఏర్పాటవుతున్నాయని తెలిపారు. యువత చెడు మార్గంలో మళ్లకుండా ఉండేందుకు కొంత వినోద కార్యక్రమం కల్పించాలన్న ఉద్దేశంతో సినిమా థియేటర్‌ను తిరిగి ప్రారంభిస్తున్నామని విజయథర్ చెప్పారు. 1380 వరకు కశ్మీర్ లోయిలో దాదాపు 12 సినిమా హాళ్లు ఉండేవి. అయితే రెండు ఉగ్రవాద గ్రూపులు ఆయా యజమానులను బెదిరించడంతో వాటిని మూసివేశారు.

first multiplex set to open in September in Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News