Thursday, January 2, 2025

ఒకే దేశం, ఒకే ఎన్నికలపై కోవింద్ అధ్యక్షతన నేడు తొలి సమావేశం?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చైర్మన్‌గా ఏర్పడిన ఒకే దేశం, ఒకే ఎన్నికల కమిటీ తొలి అధికారిక సమావేశం బుధవారం జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఢిల్లీలోని రాంనాథ్ కోవింద్ నివాసంలో ఆయన అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. రాంనాథ్ కోవింద్ సారథ్యంలో ఒకే దేశం, ఒకే ఎన్నికల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఈ నెల మొదట్లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వచర్య దరిమిలా వచ్చే ఏడాది జరగవలసి ఉన్న లోక్‌సభ ఎన్నికలు ముందుగా వచ్చే అవకాశం ఉందన్న విస్తృతంగా సాగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News