- Advertisement -
వాషింగ్టన్ : అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ మొదటి కేసు నమోదైంది. గత నెల 22న దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ వచ్చిందని, అతనిలో స్వల్ప లక్షణాలే ఉన్నాయని వైట్‌హౌస్ వర్గాలు ప్రకటించాయి. ఇది అమెరికాలో మొదటి ఒమిక్రాన్ కేసని చీఫ్ మెడికల్ అడ్వయిజర్ ఆంథోనీ ఫౌసీ పేర్కొన్నారు. ఆ వ్యక్తి నవంబర్ 22 న దక్షిణాఫ్రికా నుంచి కాలిఫోర్నియాకు వచ్చాడని, అదేనెల 29 న అతనికి పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. అతడు మోడెర్నా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నాడని, అతని సంబంధీకులను పరీక్షించగా, నెగెటివ్ వచ్చిందని చెప్పారు.
ఫాసీ, ఇతర వైద్య నిపుణులు జాగ్రత్తలపై సూచనలు అందచేస్తూ ప్రజలు టీకా తప్పనిసరిగా వేసుకోవాలని, బూస్టర్ డోసులు కూడా అవసరమని, మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు.
- Advertisement -