Monday, December 23, 2024

రాష్ట్రంలో తొలి ఆన్‌లైన్ నామినేషన్ దాఖలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : అమెరికాలో ఉన్న ఓ ఎన్నారై ఆన్‌లైన్ ద్వారా స్వత్రంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన జలగం సుధీర్ అమెరికాలో ఉంటున్నారు. కోదాడ బిఆర్‌ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన జలగం సుధీర్, టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో దిగారు.

రాజకీయల పట్ల తనకు ఉన్న ఆసక్తితో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడ్డాడని తెలిపారు. కొన్ని కారణాల వల్ల అమెరికా వెళ్లడంతో నామినేషన్ దాఖలు చేయడం కష్టమని భావించాడు. కానీ మొదటిసారి తెలంగాణలో ఆన్‌లైన్ విధానంలో నామినేషన్ ప్రక్రియ ఉండడంతో, కోదాడ రిటర్నింగ్ అధికారికి ఇంటర్నెట్ ద్వారా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో నామినేషన్ మొదలైంది. వివిధ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News