Wednesday, November 6, 2024

జమ్మూ కాశ్మీర్‌లో తొలి విడతకు నోటిఫికేషన్ జారీ

- Advertisement -
- Advertisement -

నామినేషన్ల ప్రక్రియ మొదలు
24 అసెంబ్లీ సెగ్మెంట్లకు సెప్టెంబర్ 18న పోలింగ్

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్‌లో మూడు దశల అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ కోసం ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. తొలి విడతలో 24 సెగ్మెంట్లలో పోలింగ్ సెప్టెంబర్ 18న జరుగుతుంది. నోటిఫికేషన్ జారీతో అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. తొలి విడతకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 27. నామినేషన్ల పరిశీలన ఆ మరునాడు (28న) జరుగుతుంది.

అభ్యర్థిత్వం ఉపసంహరణకు చివరి తేదీ 30. అవసరమైతే సెప్టెంబర్ 18న పోలింగ్ నిర్వహిస్తారు. మొదటి దశలో దక్షిణ కాశ్మీర్ లోయలోని 16 అసెంబ్లీ సెగ్మెంట్లలోను, జమ్మూ ప్రాంతంలోని ఎనిమిది సెగ్మెంట్లలోను పోలింగ్ జరుగుతుంది. కాశ్మీర్ లోయలోని సీట్లు పాంపోర్, త్రాల్, పుల్వామా, రాజ్‌పోరా, జైనపోరా, షోపియన్, డిహెచ్ పోరా, కుల్గామ్, దేవ్‌సర్, దూరు, కొకెర్‌నాగ్ (ఎస్‌టి), అనంతనాగ్ పశ్చిమం, అనంతనాగ్, శ్రిగుఫ్వారా బిజ్‌బెహరా, షాంగుస్ అనంతనాగ్ తూర్పు, పహల్గామ్. జమ్మూ ప్రాంతంలోని సీట్లు ఇందర్‌వాల్, కిష్ట్‌వార్, పాద్దర్ నాగ్సేని, భదర్వాహ్, దోడా, దోడా పశ్చిమం, రాంబన్, బనిహాల్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News