Monday, December 23, 2024

మణిపూర్‌లో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌..

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 60 స్థానాలకు గానూ తొలిదశలో ఐదు జిల్లాల పరిధిలోని 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. సోమవారం ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 173 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. మొదటి విడతలో బరిలో ఉన్న ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్, అసెంబ్లీ స్పీకర్ వై ఖేమ్‌చంద్ సింగ్, ఉప ముఖ్యమంత్రి యుమ్మన్ జోయ్ కుమార్ సింగ్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ లోకేష్ సింగ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

First Phase of Assembly polling begin in Manipur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News