Sunday, December 22, 2024

జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యుల్ విడుదలయ్యింది. మొత్తం మూడు విడతల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ జరగనుం ది. జూన్ 27 నుంచి ఆగస్టు 8 వరకు మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ జరగనుంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశమైన ప్రవేశాల కమిటీ ఈమేర కు నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు.. కౌన్సెలింగ్ ప్ర క్రియ ప్రారంభానికి ముందే ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ మా ర్కుల మెమోలు, టిసి, కుల,ఆదాయ ధృవీకరణ పత్రాలు సిద్ధం 10లో
చేసుకోవాలని కమిటీ సూచించింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా జూన్ 27 నుంచి ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుంది. వచ్చే నెల 29 నుంచి జులై 6 వరకు మొదటి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనునున్నట్లు ఎంసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ బుర్రా వెంకటేశం తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు జూన్ 30 నుంచి జులై 8 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. జులై 12వ తేదీన మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు జులై 12 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. రెండో విడత కౌన్సెలింగ్ జులై 19 నుంచి మొదలవుతుంది.

జులై 20,21 తేదీలలో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. జులై 24న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయించనున్నారు. జులై 30 నుంచి తుది విడత ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జులై 31 సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి అదే నెల 31 నుంచి ఆగస్టు 2 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించి, ఆగస్టు 5న ఇంజినీరింగ్ తుది విడత సీట్ల కేటాయిస్తారు. ఆగస్టు 5 నుంచి 7 వరకు కాలేజీల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తారు. ఈసారి ఒకే కళాశాలలో ఒక బ్రాంచీ నుంచి మరొక బ్రాంచీ మారాలనుకునే విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ ఆన్‌లైన్‌లో కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, ఆగస్టు 12,13 తేదీలలో విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఆగస్టు 16న ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయించనున్నారు. ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు ఎంసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ బుర్రా వెంకటేశం ప్రకటించారు.

ఎప్‌సెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్

జూన్ 27 నుంచి ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్
-జూన్ 29 నుంచి జులై 6 వరకు ధ్రువపత్రాల పరిశీలన
జూన్ 30 నుంచి జులై 8 వరకు వెబ్ ఆప్షన్లు
జులై 12న ఇంజనీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు
జులై 12 నుంచి 16 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్
జులై 19 నుంచి రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్
-జులై 20 రెండో విడత స్లాట్ బుకింగ్‌కు అవకాశం
జులై 20,21 తేదీలలో రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన
జులై 24న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
జులై 30 నుంచి తుది విడత కౌన్సెలింగ్
జులై 31న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన
జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
ఆగస్టు 5న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ
ఆగస్టు 16న ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయింపు.
ఆగస్టు 17వ తేదీన స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News