Monday, December 23, 2024

ఢిల్లీ-జైపూర్ ఇక మూడున్నర గంటలే..

- Advertisement -
- Advertisement -

దౌసా : మౌలిక వసతులు, కీలక వ్యవస్థల పటిష్టత దిశలో పెట్టుబడులతో మరిన్ని పెట్టుబడులు వస్తాయని, ఇది వ్యాపారాభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రధాని మోడీ ఆదివారం రాజస్థాన్‌లోని దౌసాలో ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ వే తొలి దశను ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రగతి దిశలో ఇది మరో రాదారి, ఇందులో అంతర్భాగాన్ని ఇప్పుడు జాతికి అంకితం చేస్తున్నామని తెలిపారు. ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ వేలో భాగంగా ఇప్పుడు రూపుదిద్దుకున్న ఢిల్లీ దౌసా లాల్‌సోట్ మార్గంతో దేశ రాజధాని ఢిల్లీకి రాజస్థాన్‌రాజధాని జైపూర్‌కు ప్రయాణ కాలం గణనీయంగా తగ్గుతుంది. ఇది కీలక పరిణామం అని మోడీ తెలిపారు. ఏ పెట్టుబడి అయినా మరిన్ని పెట్టుబడుల వైపు దారులు తీరడమే తమ ప్రభుత్వ ప్రాజెక్టుల లక్షం అని ప్రధాని ఈ ఆరంభోత్సవం దశలో చెప్పారు. సుదూర ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ వేలోని రాజస్థాన్ దశను పూర్తి చేశారు. త్వరలోనే రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇందులో భాగంగా ఇప్పుడు 246 కిలోమీటర్ల సెక్షన్‌ను ఆరంభించారు. ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ లక్ష కోట్ల వరకూ ఉంటుందని అంచనావేశారు.

బటన్ నొక్కడం ద్వారా ఈ తొలిదశను ఇదే విధంగా మొత్తం రూ 18000 కోట్ల విలువైన నాలుగు జాతీయ రహదారుల ప్రాజెక్టులను కూడా మోడీ ఆవిష్కరించడం, కొన్నింటికి శంకుస్థాపనలు చేయడం జరిగింది. తొలిదశ ప్రాజెక్టుకు రూ 12,150 కోట్లు అయింది. చిన్న పెద్ద వ్యాపారులకు , దుకాణదారులకు, పరిశ్రమలకు , ప్రజలకు ఇప్పటి రైలు మార్గం ఉపకరిస్తుందని ప్రధాని తెలిపారు. ఇకపై ఈ మార్గం గుండా ఢిల్లీ జైపూర్ మధ్య ప్రయాణ కాలం సగానికి సగం తగ్గుతుందని వివరించారు. ఇప్పటివరకూ ఉన్న 5 గంటల ప్రయాణ దశ ఇకపై మూడున్నర గంటలకు తగ్గుతుంది. రాజస్థాన్ ఇతర ఈ మార్గంలోని ప్రజలు తమ పనులపై ఢిల్లీకి వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారని తెలిపారు. పలు చోట్ల గ్రామీణ జానపద చేతివృత్తుల కళాకారుల ఉత్పత్తులకు విక్రయాలు పెరిగేందుకు స్టాల్స్ ఏర్పాటు చేస్తారని చెప్పారు. అంతేకాకుండా సరిస్కా అభయారణ్యం, కియోలేడియో జాతీయ పార్క్, రాంథమ్‌బోరే నేషనల్ పార్క్, జైపూర్, అజ్మీర్ వంటి పర్యాటక, విశిష్ట స్థలాలకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు.

సభలో కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ చౌహాన్ ఇతర నేతలు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, హర్యానా సిఎం మనోహర్‌లాల్ వీడియో అనుసంధానం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి మాట్లాడారు. గెహ్లోట్ తమ నివాసం నుంచే ప్రసంగించారు. ఢిల్లీ ముంబై రైలుమార్గం దేశంలోనే అతి దూర రైలు మార్గంగా ఉంటుంది. 1386 కిలోమీటర్ల పొడవు మార్గంగా నిలుస్తుంది. ఈ మార్గం పూర్తిస్థాయిలో నిర్మితం అయిన తరువాత ఇకపై ఢిల్లీ నుంచి ముంబైకి ఈ మార్గంలో 12 గంటలలో వెళ్లవచ్చు. ఇంతకు ముందు 24 గంటల సమయం పట్టేది. ఈ ఎక్స్‌ప్రెస్ వే ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల మీదుగా వెళ్లుతుంది. పర్యాటకులకు పాక్షికంగా భారత దేశ సందర్శనకు వీలేర్పడుతుంది. మార్గమధ్యంలో పలు నగరాలు, చారిత్రక పర్యాటక కేంద్రాల పట్టణాలు ఉంటాయి. కోటా, ఇండోర్ , జైపూర్, అజ్మీర్, వడోదరా, సూరత్ వంటి వాటిని చుట్టేయవచ్చు. ప్రయాణదూరం 12 శాతం తగ్గుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News