Monday, December 23, 2024

జార్ఖండ్‌లో నేడే తొలి విడత పోలింగ్

- Advertisement -
- Advertisement -
  • 43 నియోజకవర్గాల్లో నేడు ఓటింగ్
  • బరిలో 683 మంది అభ్యర్థులు

రాంచీ: ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ బుధవారం జరగనుండగా విస్తృత స్థాయిలో సన్నాహాలు చేశా రు. బుధవారం 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనున్నది. ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగేందుకు వేలాది మంది ఎన్నికల అధికారులు, భద్రత సిబ్బందిని మోహరించారు. పోలింగ్ బృందాలను నిర్దేశిత ప్రదేశాలకు పంపా రు. 225 సున్నిత పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆ కేంద్రాలు ఐదు జిల్లాలు పశ్చిమ సింగ్‌భుమ్, లాతెహార్, లోహరదాగా, గఢ్వా, గుమ్లా జిల్లాల్లో ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15344 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు, ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగేందుకు 200 పైగా కంపెనీల భద్రత బలగాలను వ్యూహాత్మక ప్రదేశాల్లో నియోగించారు. ఈ దశలో పోలింగ్ జరగనున్న సీట్లలో 73 మంది మహిళలతో సహా 683 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండవ దశ పోలింగ్ 38 నియోజకవర్గాల్లో ఈ నెల 20న జరగనున్నది. వోట్లను 23న లెక్కిస్తారు. హేమంత్ సోరెన్ ఝార్ఖండ్‌కు ప్రస్తుత ముఖ్యమంత్రి. రాష్ట్ర శాసనసభ గడువు 2025 జనవరి 5న ముగియనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News