- Advertisement -
జమ్మూకశ్మీర్ కు వెళ్లే అమర్ నాథ్ యాత్ర ‘ప్రథమ పూజ’ నేడు(శనివారం) జరిగింది. శ్రీనగర్ లోని రాజ్ భవన్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. జూన్ 29 నుంచి బాబా బర్ఫానీ కి మొక్కులు చెల్లించడానికి భక్తులు అమర్ నాథ్ ను దర్శించుకోవచ్చు.
అమర్ నాథ్ యాత్ర ప్రశాంతంగా జరిగేందుకు ఏర్పాట్లన్ని చేశామని జమ్మూకు చెందిన అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఏడిజిపి) ఆనంద్ జైన్ శుక్రవారం తెలిపారు. ఈ ఏడాది అమర్ నాథ్ యాత్ర జూన్ 29 నుంచి మొదలయి ఆగస్టు 19 వరకు సాగుతుంది. అమర్ నాథ్ గుహ మందిరం జమ్మూకశ్మీర్ లో ఉంది. పరమ శివుడిని కొలిచేందుకు ప్రతి ఏడాది వేలాది భక్తులు అమర్ నాథ్ కు వస్తుంటారు. గత ఏడాది 4.5 లక్షలకు పైగా భక్తులు అమర్ నాథ్ కు వచ్చారు. భక్తుల రక్షణ ఇక్కడ చాలా కీలకం అని భద్రతా అదికారులు తెలిపారు.
- Advertisement -