Tuesday, September 17, 2024

బీహార్ లో కొత్త నేర చట్టాల కింద తొలి శిక్ష

- Advertisement -
- Advertisement -

పాట్నా: కొత్త నేర చట్టాల కింద బీహార్ లో ఓ హత్య కేసులో ఇద్దరికి తొలి శిక్ష…జీవిత ఖైదు పడింది. ఈ ఏడాది జులై 1న భారతీయ న్యాయ సంహిత(బిఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బిఎన్ఎస్ఎస్) అమల్లోకి వచ్చాయి. అయితే ఈ కొత్త నేరాల చట్టాల కింద తొలి శిక్ష పిడింది. విశేషం ఏమిటంటే ఘటన జరిగిన 48 రోజుల్లోనే వారిని దోషులుగా తేల్చి శిక్ష విధించారు.

బీహార్ లోని శరణ్ జిల్లాలో ధనాదిహ్ గ్రామానికి చెందిన తారకేశ్వర్ సింగ్ కుటుంబంపై జులై 17న దుండగులు దాడి చేశారు. డాబాపై నిద్రిస్తున్న వారిపై విచక్షణా రహితంగా దాడి చేసి పొడిచారు. ఈ ఘటనలో తారకేశ్వర్, ఆయన ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. దాడికి పాల్పడిన సుధాన్షు కుమార్, అంకిత్ లను పోలీసులు అరెస్టు చేశారు. 14 రోజుల్లోనే వారిపై పోలీసులు అభియోగపత్రం నమోదు చేశారు. మంగళవారం జరిపిన విచారణలో కోర్టు వారిని దోషులుగా తేల్చి తీర్పు చెప్పింది. సెషన్స్  కోర్టు  గురువారం  వారికి జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News