అచ్చంపేట : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలం గోదల్ గ్రామానికి చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి ఇటీవల విడుదలైన జేఈఈ పరీక్ష ఫలితాలలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పట్ల ఆదివారం నల్లమల ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థిని అభినందించారు.గోదల్ గ్రామానికి చెందిన వావిలాల రాజేశ్వర్ రెడ్డి, నాగలక్ష్మి దంపతుల కుమారుడు అయిన చిద్విలాస్ రెడ్డి జేఈఈకి ప్రిపేర్ అయ్యే క్రమంలో నగరంలోని ఓ సంస్థలో కోచింగ్ తీసుకుని పరీక్ష రాశాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి గోదల్ గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధించడం అభినందనీయమని నల్లమల ప్రాంత ప్రజలు హర్షిస్తూ విద్యార్థికి అభినందనలు తెలిపారు. దేశ స్థాయిలో ర్యాంకు సాధించడం ద్వారా నాగర్‌కర్నూల్ జిల్లా ఖ్యాతిని దేశానికి పరిచయం చేసినట్లు అయిందని, ఇలాంటి విద్యార్థులు చదువుకునే విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తారన్నారు. కాగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అయినందువల్లే క్రమశిక్షణతో పాటు చదువులో ప్రావీణ్యం పొందే విధంగా సూచనలు, సలహాలు ఇవ్వడం ద్వారానే జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం జరిగిందని తల్లిదండ్రులకు తోటి ఉపాధ్యాయులు కృతఙ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా గోదల్ గ్రామానికి చెందిన గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
జేఈఈ ఆల్ ఇండియాలో నల్లమల విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్
- Advertisement -
- Advertisement -
- Advertisement -