ఎలక్ట్రికల్ కిట్‌ను రూపొందించిన హైదరాబాదీ శాస్త్రవేత్తలు
హైదరాబాద్ : కరోనా వైరస్‌ను వేగంగా నిర్ధారించేందుకు హైదరాబాద్‌కు చెందిన శాస్త్రవేత్తలు హోం టెస్టింగ్ కిట్‌ను తయారు చేశారు. వైద్యులు, నిపుణులు పర్యవేక్షణలో లేకుండానే నిర్ధారించే ఈ కిట్ ధరను రూ.400గా నిర్ణయించినట్లు గురువారం ఐఐటీ హైదరాబాద్ ఓ ప్రకటనలో తెలిపింది. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ఫ్రో శివ్ గోవింద్ సింగ్ బృందం ఈ ఎలక్ట్రికల్ కిట్‌ను తయారు చేసినట్లు వివరించింది. ఈ కొవీ హోమ్ ఎలక్ట్రికల్ కిట్‌తో ఇంట్లోనే సులువుగా టెస్టు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆర్‌టిపిసిఆర్ టెస్టుతో సమానంగా దీని ఫలితం ఉంటుందని ప్రో శివగోవింద్ పేర్కొన్నారు. కేవలం 30 నిమిషాల్లోనే ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. లక్షణాలు ఉన్నా, లేకున్నా స్పష్టమైన కచ్చితత్వంతో రిపోర్టు తేలుతుందన్నారు. ఈ కిట్ తయారీలో డా సూర్యస్నాట త్రిపాఠి, సుప్రజాపట్ట, స్వాతి మోహంతితో పాటు ఇతర విద్యార్ధులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. దీన్ని ఇప్పటికే ఇఎస్‌ఐ మెడికల్ కాలేజీలో ప్రయోగాత్మకంగా వినియోగించినట్లు ఆయన వెల్లడించారు.
first rapid electronic Covid RNA test kit