Monday, December 23, 2024

మన్యంకొండలో తొలి రోప్ వే..

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: జిల్లాలోని మన్యంకొండలోని శ్రీ లక్ష్మివెంకటేశ్వర దేవాలయం తెలంగాణలోనే రోప్ వే సేవతో కూడిన మొట్టమొదటి ఆలయంగా అవతరించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర పర్యాటక శాఖ ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది. కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడంతో హైదరాబాద్ దుర్గం చెరువుకు పర్యాటక సంఖ్య భారీగా పెరుగింది. ఇదే తరహాలో మన్యంకొండ ఆలయంపైకి రోప్ వే ఒకటి ఏర్పాటు చేస్తే బావుంటుదని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్ నుండి 16 కి.మీల దూరంలో ఉన్న మన్యం కొండ దిగువ నుండి కొండ పైకి నాలుగు కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్డు ఉంది. కొండ పైకి చేరుకోవడానికి 365 మెట్లు ఉన్నాయి.

తిరుపతి తరహాలో యాత్రికులు భగవంతుని దర్శనం కోసం రెండు మార్గాలను ఉపయోగించకుంటారు. ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండే కాకుండా పొరుగున ఉన్న కర్నాటక నుండి కూడా మూడు నుండి 4 లక్షల మంది యాత్రికులు వస్తుంటారు. పర్యాటకులు, ఇతర యాత్రికుల రద్దీ పెరుగుతుండడంతో మన్యం కొండ పుణ్యక్షేత్రం రోపింగ్ మార్గం దిశగా అడుగులు వేస్తోంది. వాటి పనులను చేపట్టడానికి ప్రభుత్వం టెండర్లు వేయగా ఇటీవలే ముందుకు వచ్చిన ఒక ఏజెన్సీ రాష్ట్ర పర్యాటక శాఖతో చర్చలు జరిపింది. యాత్రికుల సౌకర్యార్థం మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనేక మౌళిక సదుపాయాల పనులకు ఆ శాఖ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా పర్యాటక అభివృద్ధి కింద ఆలయం వద్ద రోప్ వేను ప్రతిపాదించారు.

ఈ రోప్ వే కూడా మోనో కేబుల్ రివర్సిబుల్ జిగ్ బ్యాక్ ఎనిమిది సీటర్ క్యాబిన్ సిస్టమ్‌తో అమర్చబడి ఉంటుందని తెలుస్తోంది. ఈ వాలు పొడవు దాదాపు 725 మీటర్లు ఉండనుంది. ఎగువ మరియు దిగువ రెండు టెర్మినల్స్‌లో ఒక్కొక్కటి మూడు క్యాబిన్‌లతో ఆరు క్యాబిన్‌లు ఉంటాయి. దిగువ టెర్మినల్ పాయింట్ (LTP) పంప్ హౌస్ దగ్గర దీనిని ప్రతిపాదించారు. ఎగువ టెర్మినల్ పాయింట్ (UTP) కొండపై పెద్ద సైన్ బోర్డు కింద ఏటవాలుగా ఉన్న రాతిపై ఏర్పాటు చేయనున్నారు. క్యాబిన్‌లు పూర్తిగా వెంటిలేషన్‌తో ఆటోమేటిక్‌గా పని చేసే తలుపులతో మూసివేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News