Saturday, July 6, 2024

నేడు కొలువుదీరనున్న లోక్‌సభ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కొత్తగా ఎన్నికైన సభ్యులతో లోక్‌సభ కొలువుదీరనుంది. సోమవారం మొదలు కాను న్న తొలి సెషన్‌లో కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్ర మాణస్వీకారంచేయనున్నారు,బుధవారంలోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. గురువారం పా ర్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత, ఏడు సార్లు ఎంపి భర్తృహరి మహతాబ్‌ను ప్రొటెమ్ స్పీకర్‌గా నియమించడంపై వివాదం ఈ సెషన్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆయన నియామకా న్ని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రొటెమ్ స్పీ కర్ పదవికి కాంగ్రెస్ సభ్యుడు కె సురేష్‌ను ప్ర భుత్వం అలక్షం చేసిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

లోక్‌సభ సభ్యుడుగా అంతరాయం లే కుండా ఏడు సార్లు ఉన్న మహతాబ్ ప్రొటెమ్ స్పీ కర్ పదవికి అర్హుడని, సురేష్ 1998, 2004 ఎ న్నికల్లో ఓడిపోయారని, దానితో ఆయన దిగువ సభలో వరుసగా నాలుగవ తడవ సభ్యుడుగా ఉ న్నారని పార్లమెంటరీ  వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. సురేష్‌అంతకుముందు 1989, 1991, 1996, 1999 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు, సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో మహతాబ్‌తో లోక్‌సభ ప్రొటెమ్ స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయిస్తారు, ఆ తరువాత మహతాబ్ పార్లమెంట్ భవనానికి చేరుకుని ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశా న్ని ఏర్పాటు చేస్తారు, 18వ లోక్‌సభ తొలి సెషన్ సందర్భంగా సభ్యులు ఒక నిమిషం మౌనం పాటించడంతో కార్యకలాపాలు మొదలవుతాయి.

అనంతరం లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ దిగువ సభకు ఎన్నికైన సభ్యుల జాబితాను సభకు సమర్పిస్తారు, అటుపిమ్మట లోక్‌సభ నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీని సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయవలసిందని మహతాబ్ కోరతారు, 26న స్పీకర్ ఎన్నిక వరకు సభా కార్యకలాపాల్లో తనకు సాయం నిమిత్తం రాష్ట్రపతి ని యమించిన చైర్‌పర్సన్ల బృందంతో ప్రొటెమ్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు, లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడంలో మహతాబ్‌కు తోడ్పడేందుకు కొడికున్నిల్ సురేష్ (కాంగ్రెస్), టిఆర్ బాలు (డిఎంకె), రాధా మోహన్ సింగ్, ఫగ్గన్ సింగ్ కులస్థే (ఇద్దరూ బిజెపి), సుదీప్ బందోపాధ్యాయ (టిఎంసి)లనురాష్ట్రపతి నియమించారు, చైర్‌పర్సన్ల బృందం తరువాత ప్రొటెమ్ స్పీకర్ మంత్రి మం డలి సభ్యులతో లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

అక్షర క్రమంలో రాష్ట్రాలకు చెందిన స భ్యులు తదుపరి రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారం చే స్తారు. లోక్‌సభ స్పీకర్ పదవికి బుధవారం ఎన్నిక జరుగుతుంది. ఆ వెంటనే ప్రధాని తన మంత్రి మండలిని సభకు పరిచయం చేస్తారు. రాష్ట్రపతి 27న పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసి ఉంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ 28న మొదలవుతుంది. ఆ చర్చకు ప్రధాని జూలై 2న లేదా 3న సమాధానం ఇవ్వవచ్చు. ఉభయ సభలు ఆ తరువాత కొద్ది కాలం విరామం తీసుకుంటాయి. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదన నిమిత్తం ఉభయ సభలు తిరిగి జూలై 22న సమావేశం అవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News