Monday, December 23, 2024

రేపటికి వాయిదా పడిన పార్లమెంటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంటు వెలుపల సోమవారం ప్రతిపక్ష ఇండియా బ్లాక్ నాయకులు నిరసనకు దిగారు. పార్లమెంటు సమావేశం రేపటికి(మంగళవారానికి) వాయిదా పడింది.  18వ లోక్ సభకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణం చేస్తుండగానే ఇండియా బ్లాక్ నాయకులు నిరసనకు దిగారు. బిజెపి నేతృత్వంలోని ఎన్ డిఏ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగం ప్రతులను చేతబూని మరి నిరసన చేపట్టారు. నిరసనకు దిగిన నాయకులలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నాయకురాలు సోనియా గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ తదితరులున్నారు.

ఇదిలావుండగా, ప్రధాని నరేంద్ర మోడీ18వ లోక్ సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించారు. దీనికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిజెపి ఎంపీ భర్తృహరి మహతాబ్ తో ప్రొటెం స్పీకర్ గా ప్రమాణస్వీకారం చేయించారు. కాగా ఎనిమిది సార్లు కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన కె. సురేశ్ ను కాదని మెహతాబ్ ను ప్రొటెం స్పీకర్ గా ఎంచుకోవడంపై కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

ఇకపోతే జూన్ 26న లోక్ సభ కొత్త స్పీకర్ ను ఎన్నుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు ప్రొటమ్ స్పీకరే కార్యకలాపాలను కొనసాగించనున్నారు.

18వ లోక్ సభలో ఇండియా బ్లాక్ కు 234 సీట్లు, ఎన్ డిఏ కూటమికి 293 సీట్లు ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News