Monday, December 23, 2024

అదరగొట్టిన ‘పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్..’

- Advertisement -
- Advertisement -

అదిరిపోయే సంగీతం… మైమరపించే విజువల్స్… ఊరమాస్ స్టెప్స్… క్లాప్ కొట్టించే ఐకాన్‌స్టార్ స్వాగ్… వినగానే వావ్ అనిపించే లిరిక్స్… ఇలా ఒకటేమిటి… పుష్ప… పుష్ప… ఫుష్పరాజ్… నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే… దేశం దద్దరిల్లే… ఈ పాట వింటుంటే అందరికీ గూజ్‌బంప్స్… ఇక ఐకాన్‌స్టార్ అభిమానుల సంబరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పుష్ప 2ః ది రూల్’లోని తొలి లిరికల్ వీడియోకు అద్భుతమైన స్పందన వస్తోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇక ఈ లిరికల్ వీడియోను బుధవారం విడుదల చేశారు మేకర్స్. చంద్రబోస్ లిరిక్స్‌తో ఈ పాట హై మాసివ్‌గా… పూర్తి కమర్షియల్ సాంగ్‌గా ఉంది. విజయ్ పొల్లంకి, శ్రేష్టి వర్మ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో కూడా విడుదల చేశారు. ఇక ఆగస్టు 15న దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘పుష్ప 2ః ది రూల్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News