Sunday, December 22, 2024

’మిస్టర్ బచ్చన్’ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ’మిస్టర్ బచ్చన్’ కోసం మరోసారి కలిశారు. ఇటీవల విడుదలైన షోరీల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ’మిస్టర్ బచ్చన్’ ఫస్ట్ సింగిల్ సితార్ సాంగ్ సోమవారం విడుదల కానుంది. స్టార్ కంపోజర్ మిక్కీ జె మేయర్ ఈ సినిమా కోసం అదిరిపోయే ఆల్బం కంపోజ్ చేశారు. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మ్యూజికల్‌గా హిట్స్ గా ఆలరించాయి.

’మిరపకాయ్’ ఆడియో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ’మిస్టర్ బచ్చన్’ ఆల్బమ్ కూడా చార్ట్‌బస్టర్ హిట్ కాబోతోంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ నటిస్తుండగా, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News