Sunday, April 13, 2025

‘విశ్వంభర’ నుంచి తొలి సింగిల్ ప్రోమో వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. సోషియో-ఫాంటసీగా రూపొందుతున్న ఈ సినిమాకి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ సినిమా నుంచి తొలి సింగిల్ ‘రామ రామ’ ప్రొమోని గురువారం విడుదల చేశారు. హనుమంతుడి వేషంలో ఉన్న చిన్నారులతో కలిసి చిరు రావడం మనం ఈ ప్రోమోలో చూడవచ్చు. ఇక పూర్తి పాటను హనుమాన్ జయంతి సందర్శంగా 12వ తేదీన విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇక ఈ సినిమాను యూవి క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా.. అషిక రంగనాథ్ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమా మే 9వ తేదీన విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News