Tuesday, September 17, 2024

ఆది జ్వాల.. అనంత జ్వాల.. వైర జ్వాల..

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ’కంగువ’ అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. మంగళవారం సూర్య పుట్టిన రోజు సందర్భంగా ’కంగువ’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ’ఫైర్ సాంగ్’ రిలీజ్ చేశారు. ఈ పాటలో యుద్ధ వీరుడిగా సూర్య మేకోవర్, ఫెరోషియస్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ‘ఫైర్ సాంగ్’కు ఫైర్ ఉన్న పవర్‌ఫుల్ ట్యూన్ కంపోజ్ చేశారు.

శ్రీమణి ఆకట్టుకునే లిరిక్స్ అందించగా అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్‌గా పాడారు. ’ఆది జ్వాల..అనంత జ్వాల..వైర జ్వాల.. వీర జ్వాల..దైవ జ్వాల..దావాగ్ని జ్వాల..’ అంటూ ఈ పాట సాగుతుంది. ’పైర్ సాంగ్’ ‘కంగువ’కు స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ‘కంగువ‘ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ’కంగువ’ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ’కంగువ’ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషర్స్ తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.

బర్త్‌డే స్పెషల్ గ్లింప్స్…
వర్సటైల్ స్టార్ సూర్య గ్యాంగ్‌స్టర్ డ్రామా కోసం టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ కార్తీక్ సుబ్బరాజ్‌తో చేతులు కలిపారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ గ్లింప్స్‌ని లాంచ్ చేశారు. ఈ స్పెషల్ గ్లింప్స్ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News