Tuesday, December 24, 2024

సెప్టెంబర్ నాటికి వందశాతం మురుగునీటి శుద్ధి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమయ్యే ప్రతి మురుగునీటి చుక్కను శుద్ధి చేయబోతున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. శనివారం జలమండలి కోకాపేటలో నూతనంగా నిర్మించిన మొదటి మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో మురుగు నీటి శుద్ధి కోసం చేసిన ప్రణాళికలు విడతల వారీగా అందుబాటులోకి వస్తున్నాయని, కోకాపేటలో 15 ఎంఎల్డీల సామర్థ్యంతో, 41 కోట్ల వ్యయంతో నిర్మించిన మొదటి ఎస్టిపి ప్రారంభంతో హైదరాబాద్ దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరబాద్ అవతరిస్తుందని పునరుద్ఘాటించారు. హైద్రాబాద్ లో ప్రతినిత్యం దాదాపు 2000 ఎమ్మెల్డీల మురుగు ఉత్పత్తి అవుతోందని దేశంలోని ఏ నగరం కూడా 40 శాతం కూడా మురుగు శుద్ధి చేయడం లేదని గుర్తు చేశారు.

ప్రభుత్వం రూ.3866 కోట్లతో 1259ఎమ్మెల్డిల సామర్థ్యంతో కొత్తగా 31 ఎస్టీపీలు శ్రీకారం చుట్టిందని, అన్నీ ఎస్టీపీలను సెప్టెంబర్ చివరినాటికి హైదరాబాద్ లో 100 శాతం మురుగును శుద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేసారు. వంద శాతం మురుగు శుద్ధి అనేది ఈ దేశంలోని ఏ మెట్రో నగరం చేయని ఆలోచన, ఏ ప్రభుత్వం చేయలేని సాహసం మా ప్రభుత్వం చేసిందని ఆ సాహసం తలపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు, ఆ ఆలోచను నిర్వఘ్నంగా పూర్తిచేసిన జలమండలికి అభినందనలు తెలిపారు. అదే విధంగా జిహెచ్‌ఎంసి పరిధిలో 11 లక్షల కుటుంబాలకు నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచిత తాగు నీరు అందిస్తున్నామని దీనికోసం ఇప్పటిదాకా రూ.850 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.

అంతకు ముందు మంత్రి కేటీఆర్, మంత్రి, ఎమ్మెల్యేలతో కలిసి ఎస్టీపీలోని మొదటి ప్రక్రియగా పిలిచే వెట్ వెల్ మోటారు మీట నొక్కి ప్రారంభించారు. అలాగే జలమండలి ఎస్టీపీ ప్రాజెక్టు సంబంచిన ఫోటో ఎక్షిబిషన్ తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబీర్ పూర్ రాజు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అనితా హర్ నాథ్ రెడ్డి, జిహెచ్‌ఎంసి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మెట్రోపాలిటన్ కమిషనర్ ఆర్వింద్ కుమార్, జలమండలి ఎండీ దాన కిషోర్, ఈడీ సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు ఇతర ఉన్నతాధికారులతో పాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎస్టీపీ ప్రాజెక్టు వివరాలు:
హైదరాబాద్ మహానగరంలో మురుగు నీటి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజూ 1950 మిలియన్ గ్యాలన్ల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. ఇందులో జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో 1650 మిలియన్ గ్యాలన్లు ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా 772 మిలియన్ గ్యాలన్ల మురుగు నీటిని శుద్ధి చేస్తున్నారు. ఇక మిగిలిన 878 మిలియన్ గ్యాలన్ల మురుగు నీటిని శుభ్రం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 31 నూతన మురుగు నీటి శుద్ధి కేంద్రాలను (ఎస్టీపీ)ల నిర్మాణాలు చేపట్టింది. వీటిని నిర్మించే బాధ్యతను జలమండలిపై పెట్టింది. రూ.3,866.41 కోట్ల వ్యయంతో 3 ప్యాకేజీల్లో 5 సర్కిళ్లలో నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం ద్వారా 100 శాతం మురుగును శుద్ధి చేయడమే కాకుండా పరివాహక ప్రాంతాల్లో మురుగు ప్రవాహాన్ని నిరోధించడం, శుద్ధి చేసిన నీటిని మానవేతర అవసరాలకు వినియోగించవచ్చు. అంతేకాకుండా భూగర్భ జలాలు కలుషితం కాకుండా.. పర్యావరణం, ప్రజారోగ్యం పై ఎలాంటి దుష్పలితాలు ఉండవు. ఇవి పూర్తయి అందుబాటులోకి వస్తే రోజూ ఉత్పత్తయ్యే మురుగును 100 శాతం శుద్ధి చేసే తొలి నగరంగా దక్షిణాసియాలోనే హైదరాబాద్ ఖ్యాతికెక్కుతుంది.

ప్యాకేజీల పరంగా వివరాలు
1) ప్యాకేజీ-I లో అల్వాల్, మల్కాజ్ గిరి, కాప్రా, ఉప్పల్ సర్కిల్ ప్రాంతాల్లో రూ.1230.21 కోట్లతో 8 ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా 402.50 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు.
2) ప్యాకేజీ-II లో రాజేంద్రనగర్, ఎల్బీ నగర్ సర్కిల్ ప్రాతాల్లో రూ.1355.33 కోట్లతో 6 ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ 480.50 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు.
3) ప్యాకేజీ-III లో కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో రూ.1280.87 కోట్ల వ్యయంతో 17 ఎస్టీపీలను ఏర్పాటు చేసి, ఇక్కడ 376.5 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేయనున్నారు.
ఈ 31 ఎస్టీపీలు అందుబాటులోకి వస్తే.. నగరంలో మురుగు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వీటి ద్వారా రోజూ 1282 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేయవచ్చు. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతోంది.

సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీ :
అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతోంది. మెట్రో నగరాల్లో స్థలాభావం ఉంటుంది కాబట్టి ఎస్బీఆర్ టెక్నాలజీతో నిర్మాణం అనువుగా ఉంటుంది. వీటి వ్ల్ల ఒకే ఛాంబర్లో ఐదు స్టేజీల మురుగునీటి శుద్ధి ప్రక్రియ జరిగి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నీటిని శుద్ధి చేయ్వ్చ్చు. దేశంలో వినియోగిస్తున్న వివిధ బయోలాజికల్ ట్రీట్ మెంట్ పద్ధతుల కంటే ఈ ఎస్బీఆర్ విధానానికి త్క్కువ ఖ్చ్రు అవ్డమే కాకుండా.. మురుగునీటి శుద్ధి మెరుగ్గా జరుగుతుంది. ఇది తేలికైన విధానం. దీనికి విద్యుత్తు వినియోగం సైతం తక్కువగా ఉంటుంది.
వీటి నిర్మాణ పనుల్ని ఎండీ దానకిశోర్ పలుమార్లు సందర్శించి పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. లోటుపాట్లను గమనించి దిశానిర్దేశం చేశారు. జలమండలి అధికారులతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులు, గుత్తేదారులతో సమీక్షలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలు అందించారు. ఎస్టీపీ ప్రాంగణంలో వచ్చే దుర్వాసనను అరికట్టేందుకు సుగంధ ద్రవ్యాల జాతికి చెందిన ఆకాశ మల్లి, మిల్లింగ్, టోనియా, మైకేలియా చంపాకా (సింహాచలం సంపంగి), ఆక్సీజన్ అధికంగా ఉత్పత్తి చేసే అల్లనేరేడు, మహాగని, బిగ్నోనియా మొదలగు మొక్కలను నాటారు. ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం, పచ్చదనం కోసం గార్డెనింగ్, నడక కోసం వాకింగ్ ట్రాక్ లు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News