Friday, November 15, 2024

తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో మలక్ పేటలోని యశోదా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శాంతిస్వ‌రూప్ మృతిప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు, జ‌ర్న‌లిస్టులు సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్రకటించారు.

1977 అక్టోబర్ 23న దూరదర్శన్ కార్యక్రమాలను నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. దూరదర్శన్‌లో మొట్టమొదటి యాంకర్‌గా ఆయన సేవలందించారు. 1983 న‌వంబ‌ర్ 14న దూరద‌ర్శ‌న్ చానెల్‌లో శాంతి స్వ‌రూప్ తెలుగులో తొలిసారి వార్త‌లు చ‌దివారు. ప‌ది సంవత్సరాల పాటు టెలీప్రాంప్ట‌ర్ లేకుండా పేప‌ర్ చూసి వార్త‌లు చదివి మంచి పేరు తెచ్చుకున్నారు. తొలి తెలుగు న్యూస్ రీడ‌ర్‌గా చెర‌గ‌ని ముద్ర వేశారు. 2011లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే వ‌ర‌కు శాంతి స్వ‌రూప్ వార్త‌లు చ‌దివారు. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును కూడా ఆయ‌న అందుకున్నారు. శాంతిస్వ‌రూప్‌కు భార్య‌, ఇద్ద‌రు కుమారులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News