Sunday, December 22, 2024

భారత్-శ్రీలంక‌తో తొలి టెస్టు.. క్రీజులో మయాంక్, రోహిత్

- Advertisement -
- Advertisement -

First Test against India-Sri Lanka

 

మొహాలీ: శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. మొహాలీ వేదికగా భారత్ శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మొదటి రోజు ఆట ప్రారంభమైంది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ నిలకడగా ఆడుతున్నారు. రోహిత్ శర్మ 11 (15), మయాంక్ అగర్వాల్ 19(27) స్కోర్లతో క్రీజులో ఉన్నారు. భారత్ స్కోరు 07 ఓవర్లకు 32 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. విరాట్ కోహ్లి కెరీర్‌లో ఇది వందో టెస్టు మ్యాచ్ కావడమే దీనికి కారణం. ఈ మ్యాచ్‌లో గెలిచి విరాట్‌కు అరుదైన బహుమతిని అందించాలనే పట్టుదలతో టీమిండియా క్రికెటర్లు ఉన్నారు. ఇక రోహిత్ శర్మ కెప్టెన్‌గా టీమిండియా ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడంతో అందరి దృష్టి దీనిపై నిలిచింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News