Monday, December 23, 2024

పాక్‌-కివీస్ తొలి టెస్టు డ్రా

- Advertisement -
- Advertisement -

కరాచీ: పాకిస్థాన్‌-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. శుక్రవారం ఐదో రోజు పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. ఓపెనర్ ఇమాముల్ హక్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హక్ పది ఫోర్లు, ఒక సిక్స్‌తో 96 పరుగులు చేశాడు.

వికెట్ కీపర్ సర్ఫరాజ్ ఖాన్ (53), సౌద్ షకిల్ 55 (నాటౌట్), వసీం జూనియర్ (43) కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. దీంతో పాకిస్థాన్ కివీస్ ముందు 15 ఓవర్లలో 138 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తరవాత రెండో ఇన్నింగ్స్‌ను చేపట్టిన న్యూజిలాండ్ 7.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. ఈ క్రమంలో వెలుతురు తగ్గడంతో మ్యాచ్‌ను అక్కడే నిలిపి వేశారు. దీంతో డ్రాగా ముగియక తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News