అమరావతి: హైదరాబాద్ అంటే ఒకప్పుడు ఏది అని ఆ సమయంలో అడిగేవారని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. దావోస్ పర్యటన విజయవంతం కావడంతో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. దేశంలో మొట్ట మొదటిసారి దావోస్ వెళ్లాలని నిర్ణయం తీసుకుంది తానేనని తెలియజేశారు. 1997 నుంచి దావోస్ కు వెళ్తున్నానని, ఒకప్పుడు ఐటి గురించి మాట్లాడితే.. ఇప్పుడు ఎఐ గురించి మాట్లాడుతున్నామని సిఎం పేర్కొన్నారు. మొదట్లో తనకు, కృష్ణకు పోటీ ఉండేదని, మూడు కాంగ్రెస్ సెషన్లు జరిగాయన్నారు. దావోస్ లో మొత్తం 27 సమావేశాలు జరిగాయని స్పష్టం చేశారు.
భారత్‌కు బంగారు భవిష్యత్తు ఉండబోతోందని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మనదని పేర్కొన్నారు. 2028 నాటికి జిడిపి వృద్ధిలో మనమే నెంబర్ వన్‌గా ఉంటామని, కేంద్రంలో మనకు అత్యంత సమర్థమైన ప్రభుత్వం ఉందన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు స్పందించారు. విజయసాయి రాజీనామా వైసిపి అంతర్గత వ్యవహారమన్నారు. నాయకుడిపై నమ్మకం ఉంటే నేతలు ఉంటారని, లేదంటే ఎవరి మార్గం వాళ్లు చూసుకుంటారని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.