Thursday, November 21, 2024

ఆదిలాబాద్‌లో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కెఆర్‌కె కాలనీకి చెందిన జాస్మిన్ అనే యువతికి 2017లో అబ్దుల్ అనే యువకుడితో వివాహం జరిగింది. గత కొద్ది రోజులుగా భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే గతేడాది ఫిబ్రవరి నెలలో కూడా భర్త అబ్దుల్ అతిక్ పై వేధింపుల కేసు నమోదు చేయడం జరిగిందని మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాస్ వెల్లడించారు. ఇదిలా ఉంటే తాజాగా జాస్మిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబ్దుల్ అతిక్‌పై ట్రిపుల్ తలాక్ కేసు నమోదు చేసినట్లు సిఐ జీ.శ్రీనివాస్ వెల్లడించారు. ట్రిపుల్ తలాక్ ద్వారా ముస్లిం మతానికి చెందిన భర్త తన భార్యకు ఒకే సమయంలో మూడు సార్లు తలాక్, తలాక్, తలాక్ అని చెప్పడం ద్వారా విడాకులు పొందే వీలు ఉండేది.

ఇది అన్యాయం అని ముస్లిం మహిళల నుంచి సుప్రీంకోర్టుకు పెద్ద ఎత్తున పిటిషన్లు వెల్లువెత్తాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు త్రిపుల్ తలాక్ ను నిషేధించిన సంగతి తెలిసిందే. ముస్లిం మహిళ వివాహ హక్కుల సంరక్షణ బిల్లు – 2017లో సుప్రీంకోర్టు త్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధం అని తెలిపింది. 2018 లో ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం బిల్లును తయారు చేసి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు లోక్‌సభలో 2018 డిసెంబర్ 27వ తేదీన ఆమోదం తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం ముస్లిం మహిళకు ఒకేసారి ట్రిపుల్ తలాక్ చెప్పడం శిక్షార్హమైన నేరం. అలా చెబితే మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News