- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో మొదటి టీకాను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పారిశుధ్య కార్మికుడిగా పని చేసే మనీశ్‌కుమార్(34)కు ఇచ్చారు. ఢిల్లీలోని నజఫ్‌గఢ్‌లో నివాసముందే మనీశ్‌ను దేశంలోనే మొదటి టీకాకు ఎంపిక చేయడం పట్ల ఆయన సహోద్యోగులు సైతం ఆందోళన చెందినట్టు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారిలో భయాన్ని తొలగించేందుకే తాను టీకాకు సిద్ధమయ్యానని ఆయన తెలిపారు. గత(శుక్రవారం)రాత్రి తాను హాయిగా నిద్రపోయానని ఆయన తెలిపారు. ఏడేళ్లుగా ఎయిమ్స్‌లో పారిశుధ్య కార్మికుడిగా మనీశ్ పని చేస్తున్నారు. కేంద్రమంత్రి హర్షవర్ధన్ సమక్షంలోనే మనీశ్‌కు టీకా వేశారు. కరోనా కారణంగా గతంలో భయంభయంగా పని చేసే వాడినని, టీకా వేయించుకున్న తర్వాత తనకిపుడు ఎలాంటి ఆందోళన లేదని మనీశ్ తెలిపారు.
- Advertisement -