మేమ్ ఫేమస్‌తో అలరించిన హీరో సుమంత్ ప్రభాస్ ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. ఈ చిత్రం రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ కు ఫస్ట్ వెంచర్. ఎంఆర్ ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిధి ప్రదీప్ కథానాయికగా అరంగేట్రం చేస్తుండగా, జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సోమవారం నిర్మాతలు ఈ సినిమా టైటిల్ ‘గోదారి గట్టుపైన’ను ప్రకటించారు. ఇది సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని హిట్ పాట ద్వారా ఇప్పటికే ప్రజాదరణ పొందిన టైటిల్. టైటిల్ లోగో విజువల్ ఆసక్తికరంగా ఉంది. పోస్టర్ ప్రశాంతమైన గోదావరి ప్రాంతాన్ని అందంగా చూపించింది. గోదావరి జిల్లాల వేల్పూరు, రేలంగి, భీమవరం నేపథ్యంలో సెట్ చేయబడిన స్వచ్ఛమైన చిత్రానికి గోదారి గట్టుపైన అని పేరు పెట్టామని చిత్ర దర్శకుడు చెప్పారు. ప్రస్తుతం గోదారి గట్టుపైన సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
అందమైన ‘గోదారి గట్టుపైన..’
- Advertisement -
- Advertisement -
- Advertisement -