Monday, December 23, 2024

ప్రకాశం బ్యారేజీకి తొలి హెచ్చరిక జారీ

- Advertisement -
- Advertisement -
Prakasham Barrage
4 లక్షల క్యూసెక్కుల పరిధిని తాకిన నీటిమట్టం

విజయవాడ: కృష్ణా నదిలో నీటిమట్టం శుక్రవారం ఉదయం  4 లక్షల క్యూసెక్కులకు చేరడంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి హెచ్చరిక సిగ్నల్‌ను జారీచేశారు. కాగా బ్యారేజీ నుంచి 3.97 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. ప్రజలు నది వద్దకు వెళ్లవద్దని, విలేజ్ రెవెన్యూ అధికారులు, విలేజ్ సెక్రటరియేట్ సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News