లింగంపేట్ : లింగంపేట్ మండల కేంద్రంలోని ఐకేపి కార్యాలయాన్ని కామారెడ్డి శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయ రికార్డులను పరిశీలించి గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు నిర్వహిస్తున్న చేపల పెంపకం గురించి ఐకేపి ఏపియం చామంతి శ్రీనివాస్‌ను అడిగి తెలసుకున్నారు.
వివిధ గ్రామాల్లో గ్రౌండింగ్ అయిన చేపల పెంపకం లబ్ధ్దిదారులతో మాట్లాడారు. మహిళా సంఘాల మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేపల పెంపకంపై దృష్టి పెట్టాలని తద్వారా ఆదాయం వస్తుందని చెప్పారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల్లో చేపల పెంపకం లబ్ధ్దిదారులతో వారి కుటుంబ జీవన విధానం , వారి ఆర్థిక,సామాజిక పరిస్థితులపై రిపోర్టు తయారు చేసుకున్నారు. శిక్షణలో భాగంగా ఫిష్ పాండ్ ఆక్టివిటీ పై రిపోర్టు చేసుకున్నారు. మహిళా సంఘాల మహిళలు పురుషులతో సమానంగా వ్యాపార రంగాల్లో పోటీ పడటానికి చేపల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారని అందుకు లింగంపేట్ మండలమే నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపియం శ్రీనివాస్, సిసి మన్సూర్ ఖాన్ తో పాటు లబ్ధిదారులు ఉన్నారు.