Thursday, January 23, 2025

అత్యాధునిక ప్యాకేజిల్లో చేపల ఆహారోత్పత్తులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చేపలతో తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులు ఎక్కువ కాలం నిలువ ఉండేలా అత్యాధునిక పద్దతుల్లో ప్యాకేజింగ్ చేపట్టాలని తెలంగాణ ఫిషరీసర్ ఫెడరేషన్ దృష్టి సారించింది. తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తయారు చేసే చేపల ఉత్పత్తులను ఆధునిక పద్ధతుల్లో ప్యాకింగ్ నిర్వహించడానికి అనుసరించవలసిన విధానాలపై చర్చించేందుకు సనత్ నగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ కేంద్ర కార్యాలయాన్ని గురువారం సాయంత్రం ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ సందర్శించారు.

రాష్ట్ర రాజధాని నగరంతో పాటుగా రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన నగరాలలో భవిష్యత్తులో ప్రారంభించనున్న ఫిష్ ఫుడ్ సెంటర్లలో చేపల ఆహార ఉత్పత్తులను శాస్త్రీయంగా, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ప్యాకేజింగ్ నిర్వహించడానికి అనుకూలమైన మార్గాలపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ డిప్యూటీ డైరెక్టర్ మరియు బ్రాంచి ప్రధానాధికారి డాక్టర్ ఎన్ నటరాజ్ గారితో చర్చించారు. ఫిషరీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో తయారుచేయ తలపెట్టిన చేపల పచ్చళ్ళు, రొయ్యల పచ్చళ్లను ఎక్కువ కాలం నిలువ ఉంచేందుకు వీలున్న ప్యాకేజీ పద్ధతులపై ఈ సందర్భంగా చర్చించారు.

ఫెడరేషన్ నిర్వహిస్తున్న ఫిష్ క్యాంటీన్ల లో తయారు చేస్తున్న ఫిష్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, చేపల పులుసు, చేపల ఫ్రై, రొయ్యల పులుసు, ఫిష్ కర్రీ తదితర ఆహార పదార్థాలను సరైన పద్ధతిలో, శాస్త్రీయ విధానంలో ప్యాకేజింగ్ నిర్వహించి వినియోదారులకు అందించేందుకు అనుకూలంగా ఉండే ప్యాకేజీ పార్సిల్ పద్ధతులపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. ఫిసిరీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలతో పాటుగా ఎండు చేపలు ఎండు రొయ్యలు తదితర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా ప్రత్యేక ప్యాకేజీ పద్ధతులపై కూడా ఈ సందర్భంగా వివరంగా చర్చించారు.ఈ సమావేశంలో ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ శ్రీ పిట్టల రవీందర్‌తోపాటు ఫెడరేషన్ జనరల్ మేనేజర్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News