Sunday, January 19, 2025

చేపల లారీ బోల్తా… అర గంటలో చేపలు మాయం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: చేపల లారీ బోల్తాపడిన సంఘటన తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో జరిగింది. ఐటిసి క్రాస్ రోడ్డు వద్దకు రాగానే చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. గ్రామస్థలు, వాహనదారులు లారీలో ఉన్న చేపలను పట్టుకెళ్లారు. 30 నిమిషాలలో లారీలో ఉన్న చేపలను ఖాళీ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో లారీని పక్కకు తొలగించారు. దాదాపు లారీలో నాలుగు వేల చేపలు ఉన్నట్టు సమాచారం. చేపల లారీ ఎపి నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News