Thursday, January 23, 2025

అందరికీ చేప ప్రసాదం పంపిణీ చేస్తాం

- Advertisement -
- Advertisement -

గోషామహల్: చేప ప్రసాదం కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు వచ్చిన వారందరికీ బత్తిని కుటుంబ సభ్యుల చేప ప్రసాదం పంపిణీ చేస్తామని రాష్ట్ర హోంశాఖా మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. మృగశిర కార్తిని పురస్కరించుకుని అస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఉదయం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభమైంది. రాష్ట్ర హోంశాఖా మంత్రి మహమూద్ అలీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ను సందర్శించి చేప ప్రసాద ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్బంగా ఆయన చేప ప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారికి బద్రి విశాల్ పన్నాలాల్ ట్రస్ట్, అగర్వాల్ సేవాద ళ్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్ఫాహార, భోజన శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన ట్రస్ట్ ప్రతినిధి శరత్ పిత్తి, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధి అశ్విన్‌మార్గంలను చేప ప్రసాదం ఏర్పాట్లు, వచ్చిన వారికి అల్ఫాహార, భోజనం, మంచినీరు తదితర ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తెలంగాణ ప్రభుత్వం అన్నిశాఖలను సమన్వ యం చేస్తూ ఏర్పాట్లను చేపట్టిందన్నారు.

వచ్చిన వారందరికీ చేప ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుందని, ఎవ్వరూ తొందరపడి తోపులాడ వద్దని కోరారు. వివిధ ప్రాంతాల నుండి చేప ప్రసాదం కోసం వచ్చిన వారికి ప్రభుత్వంతో పాటు వివిధ సంస్థలు స్వచ్చంధంగా ముందుకు వచ్చి అల్ఫాహారం, భోజనం, ఏర్పాట్లు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఆయా సంస్థల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు రతన్‌గుప్తా, అజీజ్‌గుప్తా, ప్రదీప్ అగర్వాల్, సుధీర్ అగర్వాల్, గోపాల్‌సింగ్, శంకర్‌లాల్ యాదవ్, ఘన్‌శ్యామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News