Wednesday, January 22, 2025

పచ్చి చేప గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: పచ్చి చేప గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నీల్యానాయక్(45) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి మోతిఘణపూర్ చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ఒక చేప చేతికి చిక్కగా స్నేహితులతో మాట్లాడాతూ తినడానికి ప్రయత్నించాడు. చేప వెళ్లి గొంతులో ఇరుక్కోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్నేహితులు అతడి గొంతులో నుంచి చేప తీసే సమయానికి నాయక్ ప్రాణాలు వదిలాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు మేడిగడ్డ తండాకు చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News