Saturday, November 2, 2024

మత్య్సరంగం అభివృద్ధికి కృషి

- Advertisement -
- Advertisement -

బీమా రూ.6లక్షలకు పెంపుదల
త్వరలో విధివిధానాలు
మంత్రి తలసాని

Fisher society developed in Telangana
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మత్సరంగం అభివృద్ధికి కృషి చేస్తూ ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్సకారుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో ఎంపి బండ ప్రకాష్‌తో కలిసి మత్సశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్దమొత్తంలో నీటివనరులు అందుబాటులోకి రావడం, ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేస్తుండటంతో మత్సకారుల జీవనోపాధి ఎంతో మెరుగుపడిందన్నారు.

రాష్ట్రంలో 18సంవత్సరాలు నిండిన మత్సకారులకు సభ్యత్వం కల్పించే విషయం, దీర్ఘకాలికంగా పరిష్కారం కాని అనేక సమస్యలను పరిష్కరించేందుకు జులై 8న గంగపుత్ర , ముదిరాజ్ సంఘం ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మత్సకారుల అభివృద్ధికి తీసుకోవాల్సిన అనేక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి తగు చర్యలను తీసుకోవడం జరుగుతుందన్నారు. నూతన జిల్లాలు, నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడిన దృష్టా వాటి ఆధారంగా నూతన మత్స సహకార సంఘాల ఏర్పాటుకు అవసరమైన చర్యలను తీసుకోనున్నట్టు పేర్కొన్నారు.

మృతి చెందిన 116మంది మత్సకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2లక్షల రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ కింద చెల్లించాల్సిన పెండింగ్ నిధులను త్వరలోనే విడుదల చేస్తామన్నారు. గ్రామ పంచాయతీ చెరువుల లీజు అంశాన్ని , ఇతర అంశాలను రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ సమావేశంలో ప్రస్తావించగా,వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మరణించిన మత్సకారులకు రూ.6లక్షలు బీమా పరిహారం చెల్లిస్తామని సిఎం హామీ ఇచ్చారని , అందుకు అనుగుణంగా నూతన విధివిధానాలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్సశాఖ కమీషనర్ లచ్చిరాం భూక్యా తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News