మత్స్యకారుల వలలు, సామాగ్రి దగ్ధం
మన తెలంగాణ / కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుండం గ్రామపంచాయితీ పరిధి పాఖాల చెరువులో చేపలు పట్టేందుకు వెళ్ళిన మత్స్యకారుల నీటిపై వెళ్ళే తెప్పలు, వలను అటవీశాఖ అధికారులు పూర్తిగా దగ్ధం చేశారు. లాక్‌డౌన్ కారణంగా మత్స్యకారుల కుటుంబాల పోషణ బారంగా మారిందని వారు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. వృత్తిరీత్య జీవనోపాధి కోసం చేపల పట్టడం కోసం చెరువుకు వెళ్ళామని తెలిపారు. తమ వస్తు సామాగ్రి, వలలు బస్తాలలో అక్కడే చెరువు సమీపంలో వదిలామన్నారు. చేపలు పట్టడాన్ని గమనించిన కొందరు అటవిశాఖ అధికారులు మత్స్యకారుల సామాగ్రిని నిప్పుపెట్టి దగ్ధం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవనోపాధి కోసం మత్స్యకారుల వస్తు, సామాగ్రిని, వలలను తగులపెట్టిన ఫారెస్ట్ అధికారులపై కేసు నమోదుతో పాటు, మత్స్యకారుల వస్తు సామాగ్రికి నష్ట పరిహారం చెల్లించాని పలు పార్టీల నాయకులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు.