Monday, December 23, 2024

మత్స్య శాఖ ఒప్పంద ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి: సిపిఐ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :మత్స్యశాఖలో ఒప్పంద ఉద్యోగులుగా పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సిపిఐ పార్టీ కోరింది. 2017వ సంవత్సరంలో మెరిట్ బేస్ పై మత్స్య శాఖలో ఒప్పంద ఉద్యోగులుగా చేరిన 189 మందిని ఈ మేరకు రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ విజ్ఞప్తి చేశారు. మూడు రోజులుగా జరుగుతున్న ఒప్పంద ఉద్యోగుల ఆందోళనకు ఆమె మద్దతునిస్తూ…సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను అమలు చేయటంలో కృషి చేస్తున్న ఒప్పంద ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం ద్వారా మత్స్యకారులకు, మత్స్య రైతులకు పూర్తిస్థాయిలో నిపుణతను పెంచటానికి ఈ సిబ్బందిని వినియోగించాలని కోరారు.

అనేక సార్లు ఒప్పంద ఉద్యోగులు విన్నవించుకున్నా మత్స్య శాఖ కమిషనర్ ఆ విషయాన్ని పాలకులకు తెలియజేయక పోవడం అన్యాయం అన్నారు. చేప ఆహారం ప్రజల ఆరోగ్యానికి చాలా మంచిదని రొయ్య చేప పిల్లల పంపిణీకి పూనుకున్న రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను మత్స్యరైతులను అభివృద్ధి చేస్తున్న ఒప్పంద ఉద్యోగులను కూడా రెగ్యులరైజ్ చేసి వారిని ప్రోత్సహించాలని వారి నిపుణతను శ్రమను సద్వినియోగం చేయటానికి చర్యలు తీసుకోవాలని పశ్యపద్మ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News