Wednesday, January 22, 2025

ఫిషరీస్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం

- Advertisement -
- Advertisement -

కీలక అంశాలపై చర్చ

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య ఫిషరీస్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం సోమవారం మాసబ్ ట్యాంక్ లోని మత్స్య భవన్ సమావేశ మందిరంలో జరిగింది. ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేషంలో సుమారు 60 కి పైగా కీలక అంశాలపై సుధీర్గంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ప్రభుత్వ కార్యదర్శి పర్సన్ ఇంచార్జ్ గా వ్యవహరించిన కాలంలో ఒకటి రెండు సమావేశాలు జరిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్, వైస్ చైర్మన్ లను నియమించిన తర్వాత పూర్తిస్థాయిలో కార్యవర్గ సమావేశం జరగడం ఇదే మొదటిసారి.

ఈ సమావేశంలో వైస్ చైర్మన్ దీటి మల్లయ్య, ఎన్‌సిడిసి రీజనల్ డైరెక్టర్ దుబాసి కృష్ణవంశీ, మేనేజింగ్ డైరెక్టర్ లచ్చిరాం భూక్య, జనరల్ మేనేజర్ ఉప్పల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయిలో ఫిషరీస్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. గత పది సంవత్సరాలుగా పెండింగులో ఉన్న అనేక అంశాలపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News