Friday, November 22, 2024

ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ ఫిష్‌ను పట్టుకున్న మత్స్యకారుడు

- Advertisement -
- Advertisement -

 

గోల్డ్ ఫిష్‌లను సాధారణంగా చిన్న చేపలు అంటారు. నిజానికి, చాలా మంది ఈ చేపలను ఫిష్ బౌల్స్‌లో పెంపుడు జంతువులుగా ఉంచుతారు. టేబుల్‌పై ఉన్న గిన్నెలో ఈత కొట్టడం మీరు గమనించవచ్చు, మీరు ఎప్పుడైనా 30 కిలోల బరువున్న ఒక పెద్ద గోల్డ్ ఫిష్‌ని ఎప్పుడైనా చూశారా ? బ్రిటీష్ మత్స్యకారుడు 30.5 కిలోల బరువున్న అరుదైన, ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ ఫిష్‌ను పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ దృశ్యాలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.

క్యారెట్ అని పిలవబడే పెద్ద గోల్డ్ ఫిష్‌ చేపను పట్టుకున్న తర్వాత మత్స్యకారుడు ఆశ్చర్యపోయాడు. 42 ఏళ్ల ఆండీ హ్యాకెట్ అనే మత్స్యకారుడు ఫ్రాన్స్‌లోని షాంపైన్‌లోని బ్లూవాటర్ లేక్స్ వద్ద చేపలు పట్టేటప్పుడు అరుదైన గోల్డ్ ఫిష్‌ అతనికి చిక్కింది. అయితే దానిని పట్టుకోవచ్చని ఎప్పుడూ అనుకోలేదని, దానిని పట్టుకోవడానికి 25 నిమిషాలు పట్టిందని మత్స్యకారుడు చెప్పాడు. దానితో ఫోటోలు తీసుకున్న తరువాత సురక్షితంగా సరస్సులో విడిచిపెట్టానని జాలరి తెలిపాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News