Wednesday, January 22, 2025

చేపల వల కాళ్లకు చుట్టుకుని జాలరి మృతి

- Advertisement -
- Advertisement -

నాగిరెడ్డిపేట్ : నాగిరెడ్డి మండలం బొల్లారం గ్రామానికి చెందిన బెస్త ప్రవీణ్ 25 అనే జాలరీ చేపలు పట్టడానికి వెళ్లి చేపల వల కాళ్లకు చుటుకుని మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్ గ్రామానికి చెందిన బెస్త దేవవ్వ కుమారుడు ప్రవీణ్ ఆదివారం సాయంత్రం బొల్లారం గ్రామ ఊర చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి తెప్ప పై

నుండి వల వేస్తుండగా ప్రమాదవశాత్తు తెప్ప పై నుంచి చెరువులు పడ్డాడు. వల చేతులకు కాళ్లకు చుట్టుకోవడంతో ఈత కొట్టడానికి వీలు లేక  ఊపిరి ఆడక చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు లో పేర్కొనట్లు ఎస్సై తెలిపారు. తల్లి ఫర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News