Friday, December 20, 2024

కడియంకు మత్సకారుల సన్మానం

- Advertisement -
- Advertisement -

జఫర్‌గడ్ : మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని జఫర్‌గడ్ మత్స పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సత్కరించారు. జఫర్‌గడ్ పెద్ద చెరువును ఆన్‌లైన్ రిజర్వాయర్‌గా మార్చేందుకు సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్ళి పరిపాలన అనుమతులు తీసుకువచ్చిన కడియంను పలువురు సంఘం అధ్యక్షుడు అన్నెబోయిన బిక్షపతి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ జఫర్‌గడ్‌ను రిజర్వాయర్‌గా మార్చడం మూలంగా రైతులకు రెండు పంటలకు నీరు అందడంతో పాటు మత్స కార్మికులు ఆర్థికంగా బలోపేతం అవుతారని అన్నారు.

ఇందుకు కడియం శ్రీహరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో సంఘం నాయకులు చవనబోయిన సోమనర్సయ్య, చవనబోయిన కుమారస్వామి, అన్నెబోయిన కొమురెల్లి, కాట కుమారస్వామి, అన్నెబోయిన ఉప్పస్వామి, బాషబోయిన సుధాకర్, అన్నెబోయిన సంపత్, కుక్కల సారంగం, ఈర్ల ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News