హైదరాబాద్: నగరంలో స్మార్ట్ మిర్రర్ ఆదారిత వ్యక్తిగతీకరణ ఫిట్‌నెస్, వెల్‌నెస్ ఉపకరణం పోర్టల్‌ను అధికారికంగా మార్కెట్‌లోకి విడుదల చేశారు. పోర్టల్ పౌండర్లు ఇంద్రనీల్ గుప్తా, విశాల్ చందపేటతో పాటు పలువురు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈసందర్బంగా ఇంద్రనీల్ గుప్తా మాట్లాడుతూ అత్యున్నత శ్రేణి వ్యక్తిగత శిక్షణను పోర్టల్ అందించడంతో పాటుగా ప్రపంచ శ్రేణి పర్సనల్ ట్రైనర్‌ను సైతం పొందే అవకాశం అందిస్తుందని చెప్పారు. తమ జీవనశైలికి లోబడి ఆరోగ్యవంతమైన ప్రక్రియలను చురుగ్గా స్వీకరించే అవకాశం అందిస్తున్నట్లు తెలిపారు. ఆకర్షనీయమైన ఈ స్మార్ట్ మిర్రర్, అత్యున్నత స్థాయి వ్యక్తీగతీకరణతో పాటుగా ఏఐ శక్తివంతమైన ఫార్మ్ ఫీడ్ బ్యాక్‌తో సమగ్రమైన ఆరోగ్య, సంక్షేమ సహచరునిగా నిలుస్తుందన్నారు. ప్రతి ఇంటిలో నూతన తరపు వ్యక్తీగతీకరించిన ఫిట్‌నెస్‌ను పోర్టల్ తీసుకురానుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
ఫిట్‌నెస్ సంక్షేమంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న పోర్టల్
- Advertisement -
- Advertisement -
- Advertisement -