- Advertisement -
2023 ఏప్రిల్ 1నుంచి అమలు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దశలవారీగా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల(ఎటిఎస్) ద్వారా వాహనాలకు ఫిట్‌నెస్ టెస్టింగ్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఎటిఎస్ ద్వారా భారీ సరకు రవాణా వాహనాలకు, భారీ పాసింజర్ రవాణా వాహనాలకు ఫిట్‌నెస్ టెస్టింగులు తప్పనిసరని రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. కాగా..మధ్యరకం సరకు రవాణా వాహనాలు, మధ్యరకం పాసింజర్ రవాణా మోటారు వాహనాలు, లైట్ మోటారు వాహనాలకు(రవాణా) 2024 జూన్ 1 నుంచి ఫిట్‌నెస్ టెస్టులు తప్పనిసరని మంత్రిత్వశాఖ తెలిపింది. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లలో వాహనాల ఫిట్‌నెస్‌కు సంబంధించిన వివిధ టెస్టులు జరుగుతాయని ప్రకటనలో తెలిపింది.
- Advertisement -