Saturday, November 23, 2024

ఫిట్స్‌కు నియంత్రణ అందుబాటులో మందులు

- Advertisement -
- Advertisement -

మందులతో తగ్గకుంటే సర్జరీ, ఫేస్ మేకరతో తగ్గించే అవకాశం
ఈవ్యాధితో బాధపడుతున్నవారు పెళ్లి చేసుకోవచ్చు: డా. సీతా జయలక్ష్మి


మన తెలంగాణ,సిటీబ్యూరో: ఫిట్స్‌పై ఇప్పటికే ప్రజల్లో అపోహలున్నాయని, వీటితో బాధపడే వారిని అన్ని పనులకు దూరంగా ఉంచుతారు. వారి ప్రత్యేక దృష్టి చూడవద్దని వైద్యులు పేర్కొంటున్నారు. వైద్య విజ్ఞానం ఎంతో అభివృద్ది చెందింది ఫిట్స్ నియంత్రణకు ఎన్నో మందులు అందుబాటులో ఉన్నాయి. దాని గుర్తించడమే కీలకమని, చికిత్స చేస్తే మెరుగైన ఫలితాలుంటాయి. మందులతో తగ్గని ఫిట్స్‌కు సర్జరీ, ఫేస్‌మేకర్‌తో తగ్గించే వీలుందన్నారు. ఈవ్యాధితో బాధపడుతున్న పురుషులు, మహిళలు పెళ్లిళు చేసుకోవచ్చని, మందులు వాడితే కంట్రోల్ అవుతుందన్నారు. గర్భిణీగా ఉన్నప్పుడు ఫిట్స్ వస్తే మందులు వాడొవచ్చని, దీనితో తల్లి, బిడ్డలకు ఎలాంటి ప్రమాదముండని వెల్లడించారు. మూర్చ వెయ్యిమందిలో నలుగురికి ఉంటుందని, ఇది ఏవయస్సులోనైన రావచ్చు.

చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు వస్తుందని, చాలా సాధారణంగా ఇది రెండేళ్ల వయస్సులోపు, తరువాత 50,60 ఏళ్లుపై బడిన వారిలో వస్తుందని, మధ్యవయస్సులో రావడం తక్కువే. మూర్చ మొదలైన తరువాత వీరిలో నియంత్రణ లేకపోవడంతో దీర్ఘకాలిక ఎలిలెప్పితో ఏళ్ల తరబడి బాధపడాల్సివస్తుందని వైద్యులు వివరించారు. ఫిట్స్ మొదడులోని ఒక బాగంలో అవసరానికి మించి విద్యుత్‌శక్తి ఉత్పత్తి అవడంతో వస్తుందని, ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్ ఏబాగం నుంచి ఎక్కడికి వస్తుంది, దాని బట్టి రోగికి లక్షణాలు మొదలైతాయి.

ప్రసవం కష్టమైనప్పుడు శిశువులో ఒక్కొసారి పుట్టినప్పుడు మెదడులో రక్త సరఫరా తక్కువైనప్పడు ఫిట్స్ వస్తాయని, పిల్లలో ఫిట్స్‌ను గుర్తిస్తే వెంటనే చికిత్స చేసి తగ్గించే వీలుంది. అలాంటి ఖచ్చితంగా ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకోవాలని సూచిస్తున్నారు. మెదడు ఎదుగుదలో లోపానికి ఇంకో కారణం ఉందని కొంతమందిలో ఒక బాగంలో కానీ రెండు నుంచి మూడ్లు సెంటిమీటర్ల భాగంలో ఫిట్స్ ఉంటుందని, కొన్నిసార్లు మెదడు అర్దభాగం కానీ మొత్త మెదడులో అసాధారణ పరిస్దితి ఉండోవచ్చని, పిల్లలలో వచ్చే నియంత్రణలేని ఫిట్స్‌కు ఇదొక కారణమని, ఈసమస్య ఉన్న 100మందిలో 70మందికి మందులతో తగ్గదని పేర్కొన్నారు.

ఫిట్స్ వస్తే లక్షణాలు: ఎవరైనా కాళ్లు, చేతులు కొట్టుకుంటనే కిందపడి పోతోనే వారు ఫిట్స్ బాధపడుతున్నట్లు అనుకుంటారు కానీ ఇలా అందరి జరగదు, ఫిట్స్ లక్షణాలు ఉన్నట్లుండి చేస్తున్న పని ఆపి 20 నుంచి 30 సెక్షనన్లు బొమ్మాలా ఉంటారు. ఈసమయంలో వీరిని పలకరించినా మాట్లాడరు, ఏమైందని అడిగితే నాకేంమైందని ఎదురు ప్రశ్నిస్తారు. ఏమి గుర్తుండదు మనం గమనించాల్సిందే. అదే సమయంలో వీరు చేతులు నలపడం, మింగినట్లు చేయడం, మూతి చప్పరించడం చేస్తుంటారు. చూసే వారికి ఎందుకిలా చేస్తుంటారని అనుకుంటారు. కానీ ఫిట్స్ అని తెలుసుకోలేరు. ఇలా అస్తమానం చేస్తుంటే ఫిట్స్ అని అర్దమైతుంది. ఈక్రమంలో కాళ్లు, చేతులు కొట్టుకుంటారు. ఇది ఫిట్స్ సంబంధించేమోనని భావించి వైద్యుని సంప్రదించాలని చెబుతున్నారు.

ఫిట్స్ నిర్దారణ: ఫిట్స్ వచ్చిన వారిలో చాలామందికి ఇఇజి పరీక్ష చేస్తారు. ఇఇజిలో మొదడుపై వైర్లు పెట్టి కంప్యూటర్ ద్వారా రికార్డ్ చేస్తారు. అసాధారణ విద్యుత్ శక్తి ఏబాగం నుంచి వస్తుందో కనుగొంటారు. తరువాత మొదడు స్కానింగ్ చేస్తారు. సిటి స్కాన్‌లో ఏంతెలియదు. ఎందుకంటే ఫిట్స్ వచ్చే కారణం మిల్లీమీటర్లలో ఉంటుంది. అందుకుని ఎంఆర్‌ఐ స్కాన్ తప్పనిసరి ఫిట్స్ రోగులందరికి చేసే ఎంఆర్‌ఐ చేయకూడదు. దీనికి ఎపిలెప్సీ ప్రోటోకాల్ పాటించాలి. పీట్స్‌కు తగ్గ ఎంఆర్‌ఐ చేయాలి దీని బట్టి ఏరకమైన పిట్స్ తీవత్రను గుర్తించవచ్చు.

వందమంది ఫిట్స్ రోగులకు మందులతో చికిత్స చేస్తే 60మందికి తగ్గుతుంది: డా.సీత జయలక్ష్మి

ఫిట్స్ నియంత్రలో ఉంటుందని, చాలామంది ఫిట్స్‌కు మూడేళ్ల, ఐదేళ్లు మందులు వాడితే, పెళ్లయితే ఇక తగ్గిపోతుందని అపోహతో ఉంటారని, వందలో 15శాతం రోగుల్లో ఐదారేళ్లు మందులు వాడితే తగ్గించి ఆపేసే అవకాశముంటుందని కిమ్స్ ఆసుపత్రి వైద్యురాలు డా. సీత జయలక్షి పేర్కొన్నారు. మిగతా వారు జీవితాంతం మందులు వాడాల్సిందేనని, మందులు ఎందుకంటే ఫిట్‌సై నుంచి రక్షణ కోసమని గుర్తించాలి. బయట రోడ్ల మీద నడుస్తునప్పుడు ,వంట చేస్తునప్పుడు, ఇతర ప్రదేశాల్లో పిట్స్ వచ్చినప్పుడు కలిగి ప్రమాదాన్ని నివారించడం, పిట్స్ తగ్గించడం మందుల ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News