Wednesday, January 22, 2025

గ్యాంగ్‌స్టర్ హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

 

జైపూర్ : రాజస్థాన్ లోని సికార్ జిల్లా కేంద్రంలో శనివారం పట్టపగలే గ్యాంగ్‌స్టర్ రాజు థెట్‌ను కాల్చి చంపిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. ఒక్క రోజు లోనే నిందితులను అదుపు లోకి తీసుకున్న పోలీసులను ఆయన అభినందించారు.

నిందితుల కోసం పోలీసులు గాలిస్తుండగా, తారసపడిన నిందితులను లొంగిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించిన వారు వినకుండా కాల్పులకు పాల్పడ్డారు. దాంతో పోలీసులు కూడా కాల్పులు జరపడంతో ఇద్దరు నిందితులు గాయపడ్డారు. మిగతా ముగ్గురు కూడా లొంగిపోయారు. అరెస్టయిన వారిలో సికార్ వాసులైన మనీశ్ జాట్, విక్రమ్ గుర్జర్, హర్యానాకు చెందిన సతీశ్ కుమార్, జతిన్ మేఘ్వాల్, నవీన్ మేఘ్వాల్ ఉన్నారు.

నిన్ని ఘాటౌల్లో మరణించిన రాజు థెట్‌కు మరో గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌పాల్ సింగ్‌కు మధ్య వైరం ఉండేది. ఈ క్రమంలో 2017లో పోలీస్ ఎన్‌కౌంటర్‌లో ఆనంద్‌పాల్‌సింగ్ హతమయ్యాడు. అప్పట్లో అరెస్టయిన రాజుథెట్…. తరువాత బెయిల్‌పై బయటకు వచ్చి లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆనంద్‌పాల్ సింగ్ గ్యాంగ్ సభ్యులు రాజు థెట్ హత్యకు పథకం పన్నారు. అనుకున్నట్టుగానే శనివారం అతని ఇంటిగేటు ముందే రాజుథెట్‌ను కాల్చి చంపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News