Saturday, December 21, 2024

చిన్న గొడవతో హత్య చేసిన యువకులు

- Advertisement -
- Advertisement -

ఈ నెల 15వ తేదీన హత్య చేసిన నిందితులను బహదుర్‌పురా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా వారిలో ఓ బాలుడు ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని బహదుర్‌పుర, కిషన్‌బాగ్, బాబానగర్‌కు చెందిన షేక్ షాబాజ్ అలియాస్ అజ్జు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు, షేక్ షానవాజ్ అలియాస్ అడ్డు, షోయేబ్ ఖాన్, ఎండి ఫారూక్, సయిద్ అక్బర్, బాలుడు కలిసి హత్య చేశారు. ఆసద్‌బాబా నగర్‌కు చెందిన మహ్మద్ ఖలీల్ అలియాస్ కన్నా ఐదుగురు నిందితులు స్నేహితులు అందరూ ఒకే ఏరియాలో నివసిస్తున్నారు. ఈ నెల 15వ తేదీన ఎండి ఖలీల్, షేక్ షాబాజ్ కలిసి మూసి నాలకు సమీపంలో మద్యం సేవించారు. షాబాజ్ క్లోజ్ ఫ్రెండైన బాలుడిని ఖలీల్ భూతులు తిట్టి, కొట్టాడు. తన స్నేహితుడిని కొడుతుండడంతో కోపంతో షాబాజ్, ఖలీల్‌ను తిట్టాడు.

దీంతో ఇద్దరు గొడవపడ్డారు,దీంతో అక్కడ ఉన్న వారు వచ్చి విడిపించారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అందరి ముందు తనను తిట్టాడని కోపం పెంచుకున్న షాబాజ్, ఖలీల్‌ను చంపివేయాలని మిగతా స్నేహితులతో కలిసి ప్లాన్ వేశాడు. దీనికి కత్తిని తీసుకుని రావాలని బాలుడిని పంపించాడు. తర్వాత అందరు కలిసి ఖలీల్ కోసం వెతకడం ప్రారంభించారు. మెయిన్ రోడ్డుపై ఉన్నట్లు సమాచారం తెలియడంతో అక్కడికి వెళ్లిన నిందితులు ఖలీల్‌ను కత్తితో పొడిచిచంపారు. బాధితుడు రక్తం మడుగులో పడగానే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ రఘునాథ్, ఎస్సైలు బిక్షం, శ్రీకాంత్ తదితరులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News